అదిరిపోయే హోస్టింగ్, ఆకట్టుకునే వాక్చాతుర్యంతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. మరోవైపు అతడి పెళ్లి గురించి తరచూ ఏవో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రదీప్ ఏ షో చేసిన కానీ అందులో అతని పెళ్లి టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. గతంలో ప్రదీప్ హౌస్ట్ గా పెళ్లిచూపులు అనే షో నడిచింది. అందులో ఒక అమ్మాయిని చూసి ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడు అనే మాటలు వినిపించిన కానీ చివరికి అలాంటిదేమి జరగలేదు. ఇప్పటికి దీనిపై అప్పుడప్పుడు ప్రదీప్ సరదా ట్రోల్స్ కు బలైపోతున్నారు.
యాంకర్ సుమ కూడా భాగమైన పెళ్లి చూపులు షో భారీ బడ్జెట్ తో చేశారు. మొదట్లో పర్లేదు అనిపించినా తర్వాత ఆదరణ కోల్పోయింది. తాజాగా జీ తెలుగు లో “సూపర్ క్వీన్ 2” పేరుతో ఒక ప్రోగ్రాం నడుస్తుంది. ఇందులో రఘు కుంచె మాట్లాడుతూ గతంలో ఏదో స్వయంవరం పేరుతో ఒక షో చేశావు కదా ఇది కూడా అలాంటిదేనా అంటూ కామెంట్స్ చేయడంతో అదేమీ లేదు సర్ అది ఎప్పుడో సామాన్లు సర్దేశాం అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ షో లో సీరియల్ నటి నిఖిత ‘ఏమన్నానో ఏమి విన్నానో’ అనే సూపర్ హిట్ సాంగ్ పాడటంతో పాటుగా కన్నా నీ కోసమే అంటూ తన భర్త పై ప్రేమను పంచుకుంది.

అదే సమయంలో మరో సీరియల్ నటి ఎంట్రీ ఇచ్చి నా తరుపున ప్రదీప్ కు ఒక చిన్న బహుమతి అంటూ ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. దీంతో ఆ ఫోటోలో ఉంది అన్నకు కాబోయే వదిన అంటూ కామెంట్స్ వచ్చాయి. మరి ఆ ఫోటోలో ఉంది ఎవరో ప్రదీప్ కే తెలియాలి. మరోపక్క ఫ్యాన్స్ అతని పెళ్లి కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ప్రదీప్ టాపిక్ ఎక్కడ వచ్చిన కానీ పెళ్లి పెళ్లి అని రచ్చ రచ్చ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో దానికి ఏదైనా ప్రదీప్ పుల్ స్టాప్ పెడతాడేమో చూడాలి.