అనసూయ సినిమాల కంటే.. కాంటవర్సీలతోనే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయింది. అనసూయ ఏ పోస్ట్ చేసినా.. నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకు సూపర్ పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హంగామా చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. మెల్లగా వెండితెర వైపు పయనం మొదలుపెట్టి అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటా హవా నడిపిస్తూ ఫుల్ బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ వదులుతూ అట్రాక్ట్ చేస్తున్న అనసూయ.
అప్పుడప్పుడు నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ తన పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ సంగతులు చెబుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేసిన అనసూయ.. నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో తన ఒంటిపై ఉన్న టాటూల విహషయమై ఓపెన్ అయింది. మీ ఒంటి మీదున్న టాటూల గురించి చెప్పండి అని ఓ నెటిజన్ అడగడంతో తన ఒంటి మీద రెండు టాటూలున్నాయని చెప్పింది అనసూయ.
మొదటి టాటూని నా ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ, మా ఆయన బర్త్ డే ఒకేసారి రావడంతో వేయించుకున్నానని.. అది నిక్కు మా ఆయన పేరు. రెండోది కేలన్. గ్రీకు భాషలో కారెక్టర్ బ్యూటీ అని క్లియర్‌గా వివరించింది. బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై తన మార్క్ చూపెడుతోంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప లో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్ గా దూసుకుపోతోంది.