అనసూయ యాంకర్ గా అలరించే తీరుకు బుల్లితెరకు కొత్త రంగు వచ్చింది. టీవీ ఆడియెన్స్ కు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. కేవలం యాంకర్ గానే ఉండిపోక తన ప్రతిభను చాటుకుంది.
అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ బుల్లితెరపై అందాలను ఒళకబోయడమే కాకుండా తనలోని డాన్స్ స్కిల్స్, నటనను కూడా ప్రదర్శించింది. అలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం నటిగానే అలరిస్తోంది.
హీరోలు నొక్కితే నొక్కించుకోవాలి గిల్లితే గిల్లించుకోవాలి తప్ప హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ ఈ సందర్భంగా అనసూయ హీరో హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఇచ్చే ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.