యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తూనే నెటిజన్లతో టచ్ లో ఉంటూ తన పర్సనల్ ఫొటోస్ షేర్ చేస్తుండటం అనసూయ నైజం.
ఇలా ఆమె ట్రోల్స్ బారిన పడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే మరీ రెచ్చిపోతూ ఫొటోస్ వదులుతోంది అనసూయ. రీసెంట్ గా భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ ట్రిప్ వేసిన అనసూయ.. అక్కడి బికినీ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట మంట పెట్టింది. ఫ్యామిలీ ఫొటోస్ తో పాటు తన అందాల జాతరతో అందరిలో మైకం తెప్పించింది.
దీంతో నిత్యం సోషల్ మీడియాలో అనసూయ హవా నడుస్తోంది. ఆన్ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా అనసూయ సామజిక మాధ్యమాల్లో తొంగి చూస్తున్నారు. ఇందుకు కారణం అనసూయ స్వయంగా షేర్ చేస్తున్న ఫొటోస్, అప్ డేట్స్ అయినప్పటికీ.. ఆమె మాత్రం ‘అందరి కళ్లూ నాపైనే’ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.