ఇక తన పెళ్లి రోజున భర్త భరద్వాజ్‌తో బీచ్‌లో దిగిన ఫోటోలపై కూడా నెటిజన్లు అనసూయను గట్టిగానే ట్రోల్ చేశారు. విపరీతమైన పోటీతత్వం ఉన్న ఈ రోజుల్లో …అందులోనూ గ్లామర్ ఫీల్డ్‌లో ఫిజిక్‌ను మెయిన్‌టైన్ చేయడం అంటే మమూలు విషయం కాదు. అయితే యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెర, వెండితెర మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఆమె నడిపిస్తున్న హవా మామూలుగా కాదు.
ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, తనపై ఎన్ని ట్రోల్స్ నడిచిన అసలు లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. తనని ట్రోల్ చేస్తున్న వారికి బోలెడన్ని సార్లు క్లాస్ పీకిన అనసూయ నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ ట్రోలర్స్ కి దిమ్మతిరిగే పోస్ట్ లు పెడుతుంది. తాజాగా దసరా పండుగ సందర్భంగా జిమ్ వర్కౌట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ మళ్లీ సీరియస్ అయింది అనసూయ. జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ చెమటలు కక్కేస్తున్న వీడియోని పంచుకుంది అనసూయ.
ఈ వీడియో తో పాటు ట్రైలర్స్ కి షాక్ ఇస్తూ మహిళలని ప్రోత్సహించేలా సుదీర్ఘమైన పోస్టును రాసింది. ఈ సమాజంలో దుష్ట శక్తులపై పోరాడుతూ మహిళ నుంచి కాళీగా మారాల్సి ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ దసరాను చెడుపై మంచి సాధించిన విజయం లా జరుపుకోండి. సోమరితనాన్ని జయించండి అని చెప్పింది. రెండేళ్ల క్రిందట మా నాన్న ను కోల్పోయాను. ఒక్కసారిగా అన్నింటి పై ఆశలు పోయాయి. ఆహారపు అలవాట్లు, నిద్ర గాడి తప్పాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.