రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదైనా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటే అక్కడ తప్పనిసరిగా అనసూయ ఉంటుంది.తాజాగా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనసూయ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పాల్గొనబోతున్నారనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అనసూయ ఎక్కడ ఉన్న కెమెరాలన్నీ కూడా తనపైనే దృష్టి పడేలా అటెన్షన్ తో ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఇక అందాల ప్రదర్శనలో తనకు తానే సాటి అని అనసూయ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఎలాంటి దుస్తులు ధరించినా జనంతో పాటు కెమెరా లెన్స్ తన మీద ఫోకస్ చేసేలా జాగ్రత్త పడుతుంది. మోడ్రన్ డ్రెస్సులు అయినా, సంప్రదాయ చీరలో అయినా అందాలను ఒలికించడంలో ఆమె తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు.
రాయచోటి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లోనూ చీరకట్టుతో మైమరపించింది అనసూయ. ఆమె వేసుకున్న బ్లౌజ్ మరింత ఆకర్షణగా నిలిచింది. బ్లౌజ్ మరీ డీప్ గా ఉండటంతో అక్కడికి వచ్చిన వారితో పాటు కెమెరా కళ్లన్నీ అటువైపే ఫోకస్ పెట్టాయి. చాలా సార్లు బ్లౌజ్ ను సరి చేసుకుంటూ ఇబ్బందిగా ఫీలయ్యింది అనసూయ. అదే సమయంలో అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసింది.