ఈ మధ్య కాలంలో షూటింగులలో లేకపోవడంతో యాంకర్ అనసూయ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తూ తన అభిమానులతో ముచ్చటించింది.కాగా తాజాగా యాంకర్ అనసూయ తన వైవాహిక జీవితం గురించి పలు అంశాలను తన అభిమానులతో పంచుకుంది. శశాంక్, అనసూయ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీ. అటువంటి కుటుంబంలో కలతలు వచ్చాయా? అనసూయ భరద్వాజ్ విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారా? ఇప్పుడు కొందరిలో ఈ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం ఆమె చేసిన ఓ పోస్ట్. ఆవిడ చెప్పిన మాటలు ఎంత మాత్రం ఈ సందేహాలకు కారణం కాదు.
తాను విడాకుల గురించి ఆలోచన చేస్తున్నట్లు కూడా అనసూయ ఎక్కడా చెప్పలేదు. అయితే… అసలు విషయం దాచి పెట్టడంతో విడాకులు కూడా కావచ్చని ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు తీస్తున్నారు. అయితే శనివారం సాయంత్రం వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో నెగిటివిటీని తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నారని భావించారంతా! అలాగని, ఆవిడ చెప్పలేదు కానీ… ప్రజల ముందుకు సోషల్ మీడియాను తీసుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు అలా ఉందా? అంటూ ఆవిడ ప్రశ్నించడంతో ట్రోలింగ్ అని జనాలు భావించారు.
నెగిటివిటీని చూసి ఫీల్ అవ్వనని, కోప్పడతానని అనసూయ మరో వీడియో విడుదల చేశారు. ”అరే ఏంట్రా మీరంతా?” అంటూ అనసూయ కొత్త వీడియో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అనసూయ అటెన్షన్ కోసం అలా చేస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అనసూయను ధైర్యంగా చెబుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం ‘డివోర్స్ తీసుకుంటున్నారా ఏంటి మా’ అని కామెంట్ చేశారు.