ఈ రోజుల్లో హీరోయిన్స్ తమ పాపులారిటీ కోసం శృతి మించిన అందాల విందు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇదే బాటలో వెళుతూ తన గ్లామర్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది షాలినీ పాండే. అయితే .షాలిని పాండే అంటే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు యిట్టె గుర్తుపట్టేస్తారు.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ,షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించారు. ఊహించని రేంజ్ లో ఈ సినిమాలో సంచలన విజయం సాధించింది.ఇక ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ కెరీర్ ఓ రేంజ్ లో ఊపందుకుంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన షాలిని పాండే కి కూడా అవకాశాలు క్యూ కడతాయి అని అనుకున్నారు అందరు. కానీ ఈ సినిమా తర్వాత కూడా ఆమెకు ఒకటి రెండు అవకాశాలు వచ్చిన ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండే కథానాయకుడు,118 ,ఇద్దరి లోకం ఒక్కటే,నిశ్శబ్దం,మహారాజ సినిమాలలో నటించింది.
మహారాజ సినిమా తర్వాత షాలిని హిందీ లో మరో సినిమా చేయలేదు. చాల కాలం నుంచి షాలిని పాండే సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియా లో ఆక్టివ్ ఉండే షాలిని ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను,జిమ్ వర్క్ అవుట్ వీడియోలను షేర్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంది. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న షాలిని వీడియొ ను షేర్ చేసింది.