మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్‌గా దర్శనమిచ్చారు. సెంటర్ చూసి.. టీకొట్టులో టీ తయారు చేశారు. అంతేకాదు.. తాను తాగి.. తన అనుచరులకు కూడా టీ పోశారు. మంత్రిగారిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ ఆయనగారి కళాపోషణకు అవాక్కవుతున్నారు వైసీపీ శ్రేణులు. గత రెండు రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్న మంత్రి అంబటి రాంబాబు..
బుధవారం నాడు సత్తెనపల్లిలో టీ మాస్టర్ అవతారం ఎత్తారు. సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల సెంటర్‌లోని ఓ టీస్టాల్ వద్దకు వచ్చిన ఆయన.. అక్కడ ప్రజలతో కాసేపు మాట్లాడారు. అదే సమయంలో తాను టీ మాస్టర్‌గా మారారు. స్వయంగా టీ తయారు చేసి తాగారు మంత్రి. తన అనుచరులకు కూడా టీ పోశారు.
టీ స్టాల్ వద్దకు వచ్చిన వారితో మాట్లాడుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే, మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో మమేకం అవడాన్ని ప్రజానీకం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఓట్ల కోసం మంత్రి వర్యులు పడుతున్న తిప్పలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.