ఈ వారం అమర్ దీప్, రతికా, శోభా శెట్టి, ప్రియాంక ,అర్జున్, భోలే, తేజ, యావర్ నామినేషన్స్ లో నిలిచారు. అనంతరం బిగ్ బాస్ అబ్బాయిలకు.. అమ్మాయిలని మహారాణుల్లా చూసుకోవాలని టాస్క్ ఇచ్చారు. అయితే మంగళవారం కూడా నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. కాగా యావర్… రతిక, అశ్వినిలను నామినేట్ చేశాడు. అశ్విని-యావర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భోలే తనని నామినేట్ చేసిన క్రమంలో అమర్ తిరిగి భోలేను నామినేట్ చేశాడు.
నామినేషన్ కి నువ్వు చెప్పిన పాయింట్ సరిగా లేదు. అందుకే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఈ హౌస్లో నేను మంచి పేరు తెచ్చుకున్నాను… నువ్వు మాత్రం చెడ్డ పేరు తెచ్చుకున్నావు అన్నాడు. అవును నేను చెడ్డవాడినే నీకేమైనా ప్రాబ్లమా అంటూ అమర్ ఎదురు సమాధానం చెప్పాడు. ఈ హౌస్లో నువ్వు సాధించింది ఏమీ లేదని భోలే ఫైర్ అయ్యాడు. ఇకైనా మారు అని సలహా ఇచ్చాడు. నేను మారను అను అమర్ దీప్ సమాధానం చెప్పాడు. భోలే-అమర్ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది.
నేటి ఎపిసోడ్ తో ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం 8 మందిని నామినేట్ అయ్యారట. ఈ లిస్ట్ లో అర్జున్, అమర్, ప్రియాంక, శోభా, తేజా, భోలే, యావర్, రతిక ఉన్నారట. ఇక 8వ వారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. శోభా-సందీప్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా… సందీప్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.