జంబలకిడిపంబ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమని.. ఆ తర్వాత మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, మావిడాకులు వంటి సినిమాలకు సూపర్ హిట్స్ అందుకున్నారు. కుటుంబతరహ చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకున్నారు ఆమని. ఒకప్పుడు టాప్ హీరోయిన్ రేసులో చాలా కాలం కొనసాగిన ఆమని.. ఆ తర్వాత మెల్లగా సినిమాలకు దూరమయ్యారు.
అయితే హీరోయిన్గా మంచి పీక్స్ లో ఉన్నప్పుడే 1990 లో పెళ్లి చేసుకున్న ఆమని ఆ తర్వాత కెరియర్ లో వెనుకబడింది. సెకండ్ ఇన్నింగ్స్ ను ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న ఆమని కి దైవభక్తి ఎక్కువ.. వెంకటేశ్వర స్వామి భక్తురాలు. అలాంటి ఆమని ఖాజా మొహిద్దిన్ అనే ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన లవ్ స్టోరీ గురించి కూడా వివరించింది. అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పిన ఆమని ..అన్ని మతాలను గౌరవిస్తాను అంటూ తెలిపింది.
తన భర్త సినిమా నిర్మాత అంటే చెప్పిన ఈమె ఆయన కన్నడ ఇండస్ట్రీలో పని చేస్తారు అంటూ వెల్లడించింది. ఇకపోతే ఆయన నిర్మాతగా చేసిన ఒక సినిమాలో హీరోయిన్గా ఆమని నటించిన అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, ఆ స్నేహం పెళ్లిగా మారిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే ఆమని దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. వారిద్దరూ కూడా చిన్నపిల్లలు అంటూ తెలిపింది ఆమని.