అమల, నాగార్జున పేర్లపై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.అయినప్పటికీ అమల మాత్రం ఎప్పుడూ సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు. అమల మెడలో బంగారం ఎప్పుడూ ఉండదనే సంగతి తెలిసిందే. వేల కోట్ల ఆస్తులు ఉన్నా అమల బంగారం ధరించకపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు ఆసక్తికర విషయాలు సమాధానంగా వినిపిస్తున్నాయి. అయితే సినీ ఇండస్ట్రీలో ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా ఏదో ఒక జబ్బు బారిన పడుతున్నారు.
అది కూడా అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. రీసెంట్ గా సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు అక్కినేని అమల కూడా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్టు బయటకు వచ్చింది. అక్కినేని అమల గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె వేల కోట్లకు అధిపతి అయిన నాగార్జున భార్య అయినా సరే చాలా సింపుల్ గానే ఉంటుంది. అంతే తప్ప ఎక్కడా అహంకారం, గర్వం అనేది చూపించదు.
అయితే ఆమె ఎక్కడకు వెళ్లినా సరే చాలా సింపుల్ లుక్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఆమె బయట ఎక్కడా కూడా నగలు పెట్టుకున్నట్టు మనకు కనిపించదు. ఎందుకంటే ఆమెకు సింప్లిసిటీ అనే వ్యాధి ఉందంట. ఎన్ని కోట్ల విలువైన నగలు ఉన్నా సరే ఆమె మాత్రం సింపుల్ గానే ఉంటుంది. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే సింపుల్ గానే వెళ్తుంది. డబ్బును వృథా చేయడం కూడా ఆమెకు అస్సలు నచ్చదు. ఈ రెండు ఆమెకు జబ్బులా మారిపోయాయని తెలుస్తోంది.