జూన్ నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జరిగి రెండు నెలలు కూడా కాలేదు. ప్రస్తుతం అమలాపాల్ అభిమానులకు శుభవార్త చెప్పింది. మేం ముగ్గురం కాబోతున్నాం అని పోస్ట్ చేసింది. అమల తల్లి కాబోతోందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి.. పెళ్లయి రెండు నెలలే అయింది.
అయితే బాలాజీ మోహన్ దర్శకత్వం లో హీరో సిద్దార్ధ్ సరసన ‘లవ్ ఫెయిల్యూర్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అమలా పాల్. తర్వాత రామ్ చరణ్ నటించిన నాయక్ చిత్రంలో హీరోయిన్ అమలాపాల్. ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలు’ చిత్రంతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది.
తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు 2014 లో దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. నటుడు జగత్ దేశాయ్ ని 2023 లో ద్వితీయ వివాహం చేసుకుంది. ప్రస్తుతం మూవీస్, వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా అమలాపాల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతున్నట్టు ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా చెప్పింది. 1+1=3 అంటూ ఫన్నీగా ఇన్ స్ట్రాలో రాసుకొచ్చింది.