‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఇదే టైంలో ఓ అమ్మాయితో బన్నీ ఉన్న సెల్ఫీ వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే అదే సమయంలో బన్నీకి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఇవాళ షూటింగ్ నుంచి విరామం దొరకడంతో ఓ అమ్మాయికి హెల్ప్ చేస్తూ సరదగా ఓ వీడియో చేశాడు.
సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోవర్స్‌ని పెంచెందుకు సాయంగా నిలబడ్డాడు. ‘నీకు ఫాలోవర్స్‌ని పెంచేందుకు ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఎంతమంది ఫాలోవర్స్ కావాలి? అని బన్నీ ఆమెను అడిగాడు. దీనికి ఆ అమ్మాయి ప్రస్తుతం 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఓ 30 వేల ఫాలోవర్స్ కావాలి సార్ అంటుంది. సరే.. ఈ వీడియోతో వస్తారా? అనగా.. వస్తారు సర్ అంటూ ఆ అమ్మాయి అనడంతో..
గట్టిగా నవ్వుతూ రావాలని నేను కూడా కోరుకుంటున్నా’ అని బన్నీ అనడంతో ఈ వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి బన్నీ ఇంటి పనిమనిషి అని తెలుస్తోంది. పని మనిషి కోసం అల్లు అర్జున్ చేసిన చిరు సాయం చూసి హంబుల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుంటే.. దట్ ఈజ్ అవర్ ఐకాన్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.
Down to earth person #AlluArjun Anna 👏🏻 simplicity at peaks 🙌🏻 .
— Aᴊᴀʏ_ Kᴏʜʟɪ – 𝟭𝟴 ⁵ (@Ajaykumar180218) November 30, 2023
pic.twitter.com/CDB4VOt3ht