గోల్డెన్ స్పూన్ తో పుట్టిన క్లీంకార కు ఎంతో మంది అత్యంత ఖరీదైన బహుమానాలు ఇచ్చారు.. ఇంకా ఇస్తూనే ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ దంపతులు కూడా క్లీంకారకు అరుదైన స్పెషల్ బహుమానంను ఇచ్చారట. ఆ గిఫ్ట్ కి ఉపాసన మరియు రామ్ చరణ్ కూడా సర్ ప్రైజ్ అయ్యారు అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది. అయితే క్లీంకార.. పుట్టుకతోనే ఆమె పేరు మార్మోగిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు ఓ రేంజ్‌లో జరిగాయి. చరణ్-ఉపాసనల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి.
కూతురి కోసం ఇంట్లో రకరకాల మార్పులు చేశారు. ఇటీవలే క్లీంకార బారసాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చెర్రీ గారాలపట్టికి విలువైన బహుమతులు కూడా వచ్చాయి. ఆ తర్వాత కూడా గిఫ్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ క్లీంకారకు బంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి బహుమతిగా పంపినట్లు ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే! తాజాగా అల్లు అర్జున్‌క్లీంకారకు ఓ విలువైన కానుకను అందించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ బంగారు పలకు బహుమతిగా ఇచ్చాడట.
ఇప్పుడే పలకేంటి అనుకుంటున్నారేమో? పలక అంటే రాసుకునేది కాదు.. క్లీంకార పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలు వచ్చేలా డిజైన్ చేయించాడట! ఐకాన్ స్టార్ ఐడియా కొత్తగా ఉందని మురిసిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇకపోతే చరణ్- ఉపాసన దంపతులకు జూన్ 20న క్లీంకార జన్మించింది. జూన్ 30న ఆమె బారసాల చేసి పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. ‘క్లీంకార’ అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చాడు.