అర్హ శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీలో అర్హ నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టారు. సమంత కీలక పాత్రలో వచ్చిన శాకుంతలం సినిమా బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టినా అల్లు అర్హ మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ దేవర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాలో అల్లు అర్హ నటించేందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వచ్చే నెలలో ఈ చిన్నారి పాత్రకు సంబంధించిన షూటింగ్ చేస్తారట. ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలు ఉండనుందని ాక్ వినిపిస్తోంది.
అయితే ఈ పది నిమిషాలకే అర్హకు రూ.20 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఒక్కో నిమిషానికి రెండు లక్షలు అన్నమాట. అల్లు అర్హకు సోషల్‌మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అర్హ. ఈ సినిమాలో భరతుడిగా నటించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన ముద్దులొలికే మాటలతోనే చిన్నారి భరతుడి రాజసాన్ని ప్రతిబింబించేలా నటించింది.