సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలియాభట్ అసభ్యకర వీడియో..?

కొందరు సైబర్‌ ఆకతాయిలు సినీ తారలను టార్గెట్‌ చేసుకుని మార్ఫింగ్‌ వీడియోలు, ఫొటోలతో ఇబ్బందిపెడుతున్నారు. హీరోయిన్ల ఫేక్ వీడియోలు ఒకటి తర్వాత మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రష్మిక, కాజోల్ దీని బారిన పడ్డారు. రష్మిక, కాజోల్‌పై డీప్‌ ఫేక్‌ వీడియోలు మర్చిపోకముందే తాజాగా నటి అలియాభట్‌ను టార్గెట్‌ చేస్తూ వీడియో సృష్టించారు. అయితే రష్మిక మందన్నా, కత్రినా కైఫ్, కాజోల్ లు కూడా గతంలో ఈ డీప్ ఫేక్ వీడియోలకు బలైన విషయం తెలిసిందే.

తాజాగా ఆలియా భట్ కు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కాగానే.. ఇదీ డీప్ ఫేక్ అని, అసలు వీడియో ఇదీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ వీడియోలో కెమెరా ముందు ఎంతో అసభ్యకరమైన హావభావాలు ప్రదర్శించడం చూడొచ్చు. ఇలాంటి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోల్లోని వారికి డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల ముఖాలను కొందరు వాళ్ల పరువు తీస్తున్నారు. మొదట దీనికి బలైంది రష్మిక మందన్నా. ఆ మధ్య ఆమె ఓ లిఫ్ట్ లో ఉన్న వీడియో వైరల్ కాగా.. దీనికి ప్రముఖులంతా ఖండించారు.

అప్పటి నుంచీ ఈ డీప్ ఫేక్ వీడియో గురించి అభిమానులకు తెలిసి వచ్చింది. తర్వాత కూడా కత్రినా కైఫ్, కాజోల్ లాంటి హీరోయిన్లను కూడా ఇలాగే అసభ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నా.. డీప్ ఫేక్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. తాజా వీడియో నిజంగానే ఆలియా భట్ దే అనిపించేలా ఉండటం గమనార్హం. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీని బారిన పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *