మూత్రంలో నురుగు వ‌స్తుందా..? ఈ వ్యాధులు కార‌ణాలు కావ‌చ్చు. జాగర్త.

నీళ్లను త‌క్కువ‌గా తాగితే మూత్రం ప‌సుపు రంగులో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇలా భిన్న ర‌కాలుగా మూత్రం క‌నిపిస్తుంది. అయితే కొంద‌రికి మూత్రంలో నురుగు వ‌స్తుంది. దాని వెనుక ఉండే కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర‌శ‌యం బాగా నిండిన‌ప్పుడు స‌హ‌జంగానే మూత్ర విస‌ర్జ‌న చేస్తే మూత్రం బాగా వేగంగా వ‌స్తుంది.అయితే సాధార‌ణంగా మన‌కు ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే దాని తాలూకు ల‌క్ష‌ణాలు మ‌న‌కు మూత్రంలో క‌నిపిస్తాయి. అందుక‌నే డాక్ట‌ర్లు చాలా సంద‌ర్భాల్లో మూత్ర ప‌రీక్ష‌లు జ‌రుపుతుంటారు. త‌రువాతే వ్యాధిని నిర్దారించి చికిత్స అందిస్తారు.

అయితే మూత్రంలో కొంద‌రికి నురుగు వ‌స్తుంటుంది. 3 వ్యాధులు ముఖ్య కార‌ణాలు..మన శ‌రీరంలో కిడ్నీలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు ఏర్ప‌డే వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించేందుకు కిడ్నీలు ఎప్ప‌టిక‌ప్పుడు శ్ర‌మిస్తుంటాయి. ఈ క్ర‌మంలో కిడ్నీల ప‌నితీరు మంద‌గించిన‌ప్పుడు లేదా కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ముందు మూత్రంలో మ‌న‌కు నురుగు క‌నిపిస్తుంది. మూత్రంలో నురుగు వ‌స్తుందంటే డ‌యాబెటిస్ కూడా అందుకు కార‌ణం కావ‌చ్చు. డయాబెటిస్ ఉన్న వారిలో ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉంటాయి.

అందువ‌ల్ల మూత్రంలో గ్లూకోజ్ ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. దీని వ‌ల్ల మూత్రంలో నురుగు ఏర్ప‌డుతుంది. కిడ్నీలు లేదా మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చినా మూత్రంలో నురుగు క‌నిపిస్తుంది. క‌నుక ఎవ‌రికైనా స‌రే మూత్రంలో నురుగు వ‌స్తుందంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. వ్యాధి నిర్దార‌ణ అయితే ఆ మేర‌కు డాక్ట‌ర్ సూచించిన మందుల‌ను వాడాలి. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *