హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని ఆయన అలరించారు. ఆపై రాజకీయాల్లో రానించాలనే ఆలచనతో తొలి అడుగు కూడా వేశారు. కానీ చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. ఇక తారకరత్న మృతి.. నందమూరి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య.. పిల్లలను తలుచుకుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తారకరత్న- అలేఖ్య లవ్ స్టోరీ.. పెళ్లి గురించి అందరికి తెల్సిందే.
ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా.. అలేఖ్యను పెళ్ళాడి తారకరత్న బయటికి వచ్చేశాడు. ఇక అప్పటినుంచే అతనే ప్రపంచం గా దేవుడు అన్యాయం చేశాడు. ఇటు పుట్టింటి సపోర్ట్.. అటు అత్తింటి సపోర్ట్ ఉందో లేదో తెలియదు. ముగ్గురు బిడ్డలతో ఆమె ప్రస్తుతం తన ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఇక తారకరత్నను మర్చిపోలేని అలేఖ్య.. నిత్యం సోషల్ మీడియాలో ఆయన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. నేడు మరోసారి భర్తను తలుచుకొని ఆమె ఎమోషనల్ అయ్యింది. అందుకు కారణం.. వారి పిల్లల పుట్టినరోజు కావడం.
తారకరత్న, అలేఖ్యలకు కవల పిల్లలు. తాన్యరామ్, రేయాన్ లు పుట్టినరోజును తారకరత్న ఉంటే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాడు. కానీ, ఈరోజు ఆ చిన్నారులు తండ్రి ఫొటోకు పూలు పెడుతూ కనిపించారు. ఇక అదే విషయాన్నీ అలేఖ్య.. ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ‘ నా చిన్నారులకు పుట్టినరోజు విషెస్ ఎంతో బాగా చెప్పాలనుకున్నాను.. అదే ఆలోచించాను. కానీ, ఎంత అనుకున్నా.. ఎంత ఆలోచించినా మీ ఇద్దరికీ సరిపోయే పుట్టినరోజు శుభాకాంక్షలు నేను అందంగా చెప్పలేకపోతున్నాను.
ఈ సంతోష సమయంలో మీరు లేరు.. వర్షం కురిసే రోజు ఇంద్రధనుస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నారు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నారు..ఓబు, మమ్ము, ఎన్ నిష్కక్కు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని, వేడుకలను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక వీడియోలో తండ్రి ఫొటోకు చిన్నారులు పూలు పెడుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు చిన్నారులకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఈ కుటుంబానికి దైర్యం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నారు.