ఈవెంట్ కి హీరోయిన్ లేటుగా వచ్చిందని.. రాళ్ల దాడి చేసిన ఫ్యాన్స్.

భోజ్ పురి నటి అక్షర సింగ్‌కు ఎనలేని అభిమానులు ఉన్నారు. ఆమె సింగర్, డ్యాన్సర్ కూడా. అప్పుడప్పుడు ఈ అమ్మడు లైవ్ షోలను కూడా ఇస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్లకు భారీగా జనాభా తరలి వస్తుంటారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరవ్వగా.. ఎప్పటిలాగానే ఆమెను చూసేందుకు ఎగబడ్డారు జనం.

దీంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. బీహార్‌లో. ఔరంగాబాద్ జిల్లాలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లింది. ఆమె వస్తుందని తెలిసి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. షరా మామూలుగానే ఆమె కూడా ఈ కార్యక్రమానికి లేటుగా వచ్చింది.

అంతలో అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపైకి వచ్చి ఓ పాట పాడింది. ఇంతలో ఆమెను చూసేందుకు ఎగబడ్డారు ఫ్యాన్స్. దీంతో కాస్త తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *