తెలుగు గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీ రామారావు. నేడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి. నాగేశ్వరరావు జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు కుటుంబసభ్యులు. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలో నాగార్జున భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. నాన్నగారు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించే వరకు నేను చూడలేదు.
కారణం విగ్రహం చూస్తే ఆయన మా మధ్య లేరన్న విషయం గుర్తు వస్తుంది. అందుకే చూడలేకపోయాను. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయనకు ఇష్టమైన ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేస్తే ప్రాణప్రతిష్ట చేసినట్లే అంటారు. శిల్పి విన్నీ నాన్నగారు విగ్రహం అద్భుతంగా రోపొందించారు. కృతజ్ఞతలు. మీ అందరికీ తెలిసి నాన్నగారు అంటే అవార్డులు, రివార్డులు. అద్భుతమైన పాత్రలు, సినిమాలు. కానీ మాకు ఆయన మా గుండెలు ప్రేమతో నింపిన వ్యక్తి. నన్ను, నాతోబుట్టువులను, పిల్లలను ప్రేమతో ఆదరించారు. బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంతా సెట్ అయిపోయేది.
ఆయన అద్భుతమైన జీవితం గడిపారు. మన అందరి మందిలో ఏఎన్నార్ ఎప్పటికీ నిలిచే ఉంటారు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు పిలవగానే ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే రాజమౌళి, టి సుబ్బరామిరెడ్డి, జయసుధ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాన్నగారు దేవుళ్ళు అని చేప్పే అభిమానులకు కృతఙ్ఞతలు. ఎక్కడెక్కడి నుండో వచ్చారు. సహనంగా, క్రమశిక్షణతో వేచి ఉన్నారు. భోజనాలు ఉన్నాయి. అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఏఎన్నార్ లివ్స్ ఆన్… అంటూ నాగార్జున ప్రసంగం ముగించారు.