నాగార్జున నుండి అందుతున్న సమాచారం మేరకు నాగ సరోజ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారట. అయినా చికిత్స తీసుకుంటూ ముంబైలోని తన నివాసంలో ఉంటున్నారు. అయితే అక్కినేని నాగార్జున ఇంట్లో జరిగిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. మంగళవారం హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ సరోజ మరణానికి అనారోగ్య సమస్యలే కారణం అని తెలుస్తుంది.
కొన్నాళ్లుగా నాగ సరోజ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తున్నారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ గా పేరుగాంచిన నాగేశ్వరరావుకు ఐదుగురు సంతానం. సత్యవతి పెద్ద కుమార్తె కాగా… నాగ సరోజ, నాగ సుశీల ఆమె తర్వాత జన్మించారు. అలాగే వెంకట్, నాగార్జున అక్కినేని నాగేశ్వరావుకు పుత్ర సంతానం. సత్యవతి చాలా కాలం క్రితమే కన్నుమూసింది. ఈమె కుమారుడే సుమంత్. ఆయన హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.

నాగ సుశీల, వెంకట్ నిర్మాతలుగా మారారు. ఇక నాగార్జున స్టార్ హీరోగా తండ్రి వారసత్వం నిలబెట్టాడు. నాగ సుశీల కొడుకు సుశాంత్ హీరోగా ప్రయత్నాలు చేసి, ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. నాగ సరోజ మాత్రం పరిశ్రమకు దూరంగా ఉంది. ఆమె మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఎలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనేవారు కాదు. ఈ కారణంగా నాగ సరోజ గురించి పరిశ్రమకు, సాధారణ జనాలకు తెలిసింది తక్కువే.
నాగ సరోజ మరణం నేపథ్యంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానులు, ప్రముఖులు నాగ సరోజ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా సెప్టెంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్ర ప్రముఖుల సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ వేడుకలకు కూడా నాగ సరోజ హాజరైన దాఖలాలు లేవు.