అమెరికాలో RGVతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

వర్మకి అసలు ఎమోషన్స్ అనేవి ఉండవు అనుకుంటా అని కామెంట్స్ చేస్తారు చాలామంది. అయితే RGV కూడా ఒక విషయంలో ఎంతో ఎమోషనల్ అయ్యాడట. తనకి ఎంతో ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు చనిపోయినప్పుడు.. బాధతో దాదాపు నెల రోజులు పాటు బయటకి రాకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయట. అయితే తాజాగా ఆర్జీవీ అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో తెలుగువాళ్ళకు సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆర్జీవీ అమెరికాకు వెళ్ళాడు.

అయితే అక్కడ అమెరికాలో ఓ పోర్న్ స్టార్‌తో సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ పోర్న్ స్టార్‌ ఎవరో తెలుసా? మియా మాల్కోవా అనే అమెరికన్ పోర్న్ స్టార్‌. గతంలో మియా మాల్కోవాతో GST అనే ఓ బోల్డ్ షార్ట్ ఫిలిం కూడా తీశాడు ఆర్జీవీ. ఆ సినిమాతోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఆర్జీవీ మియా మేల్కొవాతో తీసిన GST ఓ సంచలనంగా మారింది.

పలువురు విమర్శించినా కూడా ఆ ఫిలిం చూసి అభినందించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్జీవీ ఇప్పుడు అమెరికాకు వెళ్లడంతో మరోసారి మియా మాల్కోవాని కలిశాడు. మియాతో స్పెషల్ సెల్ఫీలు తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు ఎప్పట్లాగే ఆర్జీవిని తిడుతూ కామెంట్స్ చేస్తే ఆయన అభిమానులు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ మాత్రం ఇవేమి పట్టించుకోడని తెలిసిందే. ఈ అమెరికా టూర్ అయిపోయేలోపు ఇంకెన్ని ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతాడో ఆర్జీవీ చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *