టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ భీమా, విశ్వక్‌సేన్ గామి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. భీమా సినిమా డివోషనల్ టచ్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
కన్నడ డైరెక్టర్ ఏ.హర్ష భీమా సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా గామి సినిమా ప్రయోగాత్మక కథాంశంతో రూపొందింది. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు.
దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకొన్న ఈ మూవీతో విధ్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.