మంగళవారం అదా శర్మ ఆరోగ్యం దెబ్బతిన్నడంతో తనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తనకు డయేరియాతో పాటు ఫుడ్ ఎలర్జీ కూడా అయినట్టు తెలిపారు. అదా ఒక్కసారిగా చాలా ఒత్తిడికి లోనయ్యిందని, దాంతో పాటు డయేరియాతో బాధపడుతుండడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, ప్రస్తుతం తను అబ్జర్వేషన్‌లో ఉందని సన్నిహితులు బయటపెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా అదా శర్మ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
ఆదా శర్మ ఆసుపత్రిలో చేరింది వాస్తవమే అని తెలుస్తోంది, వాస్తవానికి, నటి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారని అంటున్నారు. మంగళవారం నాడు ఆమె తాను నటించిన ఒక సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలో, పరిస్థితి అకస్మాత్తుగా విషమించడంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ రోజు అదా శర్మ కమాండోను ప్రమోట్ చేయడానికి ఇంటర్వ్యూలు చేస్తుండగా ఫుడ్ అలర్జీ, వాంతులు – విరేచనాల కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరిందని తెలుస్తోంది.
అనారోగ్య కారణాల వల్ల ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ఆదా శర్మ బృందం అధికారిక సమాచారం ఇచ్చింది. ఆదా శర్మకు సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం చాలా ఒత్తిడితో పని చేస్తున్న కారణంగా ఆమెకి డయేరియా వచ్చిందని, ఆ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఆదా త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెబ్ సిరీస్ కమాండోలో కనిపించనుంది. ఇందులో ఆమె భావనారెడ్డి అనే పాత్రలో నటిస్తోంది. .మరోసారి ఆమె యాక్షన్‌తో పాటు కామెడీ కూడా చేస్తుందని భావిస్తున్నారు.