తివారి ప్రస్తుతం బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ లోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని త్రిపాఠి కుటుంబ సభ్యులు వెల్లడించారు. తివారి అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే ‘ఓ మై గాడ్ 2 ‘ సక్సెస్‌తో సంతోషంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పండిట్ బనారస్ తివారీ (99) సోమవారం కన్నుమూశారు. బిహార్‌లోని బెల్సంద్ గ్రామంలో ఆయన తుది శ్వాస విడిచారు.
పండిట్ బనారస్ తివారీ గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారని పంకజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తన తండ్రి మరణ వార్త విన్న వెంటనే ముంబై నుండి తన గ్రామానికి బయలుదేరాడు పంకజ్ త్రిపాఠి. కాగా పలు సందర్భాల్లో తన తండ్రిపై ప్రేమను చాటుకున్నారు పంకజ్ త్రిపాఠి. ఉద్యోగ రీత్యా ఆయన ముంబైలో స్థిరపడినా.. తల్లిదండ్రుల వద్దకు తరచూ వెళ్లేవారు. ఊరికి వెళ్లినప్పుడు ఎప్పుడూ నాన్నతోనే గడిపేవారు.
సోషల్ మీడియాలో పోస్ట్‌లతో పాటు పలు ఇంటర్వ్యూలలో కూడా పంకజ్ తన తల్లిదండ్రుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు ‘నా తల్లిదండ్రులు నా నిర్ణయాలను గౌరవించకపోతే, నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. మా నాన్న చాలా అమాయకుడు కాబట్టి ఆయనకు థియేటర్, యాక్టింగ్ లాంటివి గురించి ఏమీ తెలియదు. నేను ముంబయిలో స్థిరపడ్డప్పుడు, మా నాన్న నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చిచ్చారు. ఇక్కడి ఎత్తైన భవనాలు, గుంపులు గుంపలుగా ఉన్న జనాలను చూసి భయపడ్డారు. ఇక్కడి జీవన పరిస్థితులు వారికి అస్సలు నచ్చలేదు. అందుకే ఆయన ఇక ముంబైకి తిరిగి రాలేదు’ అని చెప్పుకొచ్చారీ బాలీవుడ్ యాక్టర్.