నాగార్జునకు లిప్ కిస్ పెట్టిన హీరోయిన్. ఇప్పుడు ఎలా ఉందొ చుడండి.

మణిరత్నం తీసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇది.ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బలంగా రాయొచ్చనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది.అలా ఫస్ట్ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన గీత అలియాస్ గిరిజా శెట్టర్ కేవలం ఐదే సినిమాలు చేసింది. అయితే ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా.. కొంతమందికి గుర్తింపు వచ్చింది లేదు. కానీ, ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీని కుదిపేసినవారు చాలామంది ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ హీరోయిన్ గిరిజా శెట్టర్. ఏ.. ఎవరు ఈమె.. మాకు తేలియదే అనుకుంటున్నారా.. ? అయితే వెంటనే అక్కినేని నాగార్జున నటించిన గీతాంజలి సినిమాను చూడండి.

ఒళ్ళంతా తుళ్లింత కావాలిలే అంటూ చిన్నపిల్లలా గెంతులు వేస్తూ కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే.. ఓం నమః అంటూ నాగ్ తో పెదవి ముద్దును ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కు వెళితే.. నాకెందుకు చెప్పలేదు అంటూ నాగ్ తో గొడవపడుతూ ఉంటుంది. హా చూశారా.. ఆమెనే గిరిజా.. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని కుదిపేసి వెళ్ళిపోయింది. గిరిజా ఆంగ్లో ఇండియన్. తండ్రి కర్ణాటక కాగా.. తల్లి ఇంగ్లాండ్. ఇలా ఇండియన్ మూలాలు ఉండడంతో ఈ భామ భరతనాట్యంపై మక్కువతో 18 ఏళ్లకే భరతనాట్యం నేర్చుకొని నటిగా మారింది.

పలు భాషల్లో వేళ్ల మీద లెక్కపెట్టే అన్ని సినిమాలు తీసి.. ఇంగ్లాండ్ లో సెటిల్ అయిపోయింది. ఇన్ని ఏళ్ళు అయినా గీతాంజలి సినిమాతో గిరిజా పేరు మాత్రం మారలేదు. ఇప్పటికీ ఆమెను అందరూ గీతాంజలి అనే పిలుస్తారు. ఇక దాదాపు 20ఏళ్ళ తరువాత ఆమె మరోసారి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం గిరిజా లుక్ అస్సలు గుర్తుపట్టలేకుండా ఉంది అని చెప్పాలి. ముఖంపై వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి. సడెన్ గా చూసి అయ్యో గిరిజా ఏంటీ ఇలా మారిపోయింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *