వంగవీటి రాధా కృష్ణ.. గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ పాలిటిక్స్ లో కీలక నేత.. పొలిటికల్ లీడర్ అయిన రాధా.. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇక ఆయన పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అయితే గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువనాయకుడు మొదట కాంగ్రెస్ ఆ తర్వాత ప్రజారాజ్యం, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి కాపు కాస్తున్న వంగవీటి రాధ త్వరలో పెళ్లి కొడుకుగా మారబోతున్నారు.
వంగవీటి రాధ ఎంగేజ్మెంట్ ఈనెల19వ తేదిన జరగనుంది. సెప్టెంబర్ 6వ తేదిన వివాహం ముహుర్తం నిశ్చించినట్లుగా తెలుస్తోంది. ఈ యువనాయకుడు నరసాపురంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బ్యాచిలర్‌గా ఉన్న వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు, రాజకీయ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వంగవీటి రాధ వివాహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పొలిటిషియన్ నుంచి పెళ్లికొడుకుగా..ఏపీ రాజకీయాల్లో పరిచయం చేయనవసరం లేని పేరు వంగవీటి రాధాకృష్ణ.

వంగవీటి మోహనరంగా వారసుడిగా రాజకీయల్లోకి అడుగుపెట్టిన రాధా గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. చాలా కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న ఈ యువనేత ..అతి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. నరసాపురంకు చెందిన అమ్మాయితో ఈనెల 19న నిశ్చితార్ధం జరగనుంది. వచ్చే నెల 6వ తేదిన వంగవీటి రాధ వివాహానికి ముహుర్తం నిశ్చయించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా, వంగవీటి రంగా వారసుడిగా వంగవీటి రాధకృష్ణకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్, అభిమానులున్నారు.