రంగరాజ్ సుబ్బయ్య. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో మొత్తం 200 కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో బాహుబలి, మిర్చి, శంఖం మొదలైన చిత్రాల్లో నటించారు. సత్యరాజ్‌కు నటనపై ఆసక్తి ఎక్కువ. సినిమాల్లో నటించుటకు అతని తల్లి మొదట ఒప్పుకోలేదు. అయితే కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ మృతి చెందారు. ఆమె వయస్సు 94.
గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సత్యరాజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి మరణవార్త విన్నవెంటనే హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్ కు పయనమైనట్లు సమాచారం. నతంబాల్ కు ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి సత్యరాజ్.. కుమార్తెలు కల్పన, రూప. ఇక సత్యరాజ్ కు తల్లి అంటే ఎంతో ఇష్టం.

ఆమెకు తాను నటించిన సినిమాలు చూడడం ఇష్టం అని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్.. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపాడు. “నటుడు సోదరుడు శ్రీ సత్యరాజ్ తల్లి నతంబాల్ మరణవార్త విని బాధపడ్డాను. అమ్మయ్యర్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సోదరుడు సత్యరాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశాడు.