వర్షాకాలంలో కరెంట్‌ స్విచ్‌ బోర్డులతో జర భద్రం, మీరు ఏం చెయ్యాలంటే..?

గోడలు తడిసిపోవడంతో స్విచ్‌ బోర్డులు కూడా షాక్‌ కొడుతుంటాయి. అటువంటి పరిస్థితిలో విద్యుత్ షాక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుదాఘాతం శరీరానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. అయితే స్విచ్ బోర్డులతో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. వాటిలో హైఓల్టేజ్ కరెంట్ పాసవుతూ ఉంటుంది. వాటిని శుభ్రం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.

స్విచ్ బోర్డులు, స్వి్చ్‌లను రోజూ టచ్ చేస్తూ ఉంటాం. వర్షాకాంలో వాటిపై రకరకాల కీటకాలు, రెక్కల పురుగులు వాలుతూ ఉంటాయి. గాలిలో చెమ్మ వల్ల స్వి్చ్ బోర్డులపై తడి పొర ఏర్పడి.. దుమ్ము అతుక్కుపోతుంది. స్విచ్ బోర్డులపై పడే దుమ్ము అతుక్కుపోతుంది. రోజూ శుభ్రం చెయ్యం కాబట్టి.. కొన్ని రోజులకు ఆ దుమ్ము గట్టిగా అతుక్కుంటుంది. ఈ బోర్డులను క్లీన్ చెయ్యడానికి నీటిని వాడకూడదు. వాడితే.. కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ప్రత్యేక చిట్కా పాటించాలి. నిమ్మకాయను సగానికి కట్ చేసి, ఒక సగం చెక్కను.. బేకింగ్ సోడా (తినేసోడా)లో ముంచండి.

స్విచ్‌బోర్డ్‌పై స్విచ్చులన్నీ ఆఫ్‌లో ఉంచి… నిమ్మకాయను బోర్డుపై రుద్దండి. బేకింగ్ సోడా కణాలు ఎలక్ట్రికల్ బోర్డ్‌పై ఉండే గ్రీజు, మరకల్ని తొలగిస్తాయి. నిమ్మరసం క్రిములను తొలగిస్తుంది. స్విచ్ బోర్డ్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్ సహాయంతో కూడా శుభ్రం చేయవచ్చు. ఇందులో అసిటోన్ అనే సంక్లిష్ట రసాయనం ఉంటుంది, ఇది మరకలను తొలగిస్తుంది. తెల్లని టూత్‌పేస్ట్‌లో సోడియం బైకార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి, ఇవి మొండి మరకల్ని శుభ్రపరుస్తాయి. అందువల్ల పొడి గుడ్డకు పేస్ట్ రాసి, తుడవవచ్చు. ఐతే.. ఈ పనులు చేసేటప్పుడు మీ చేతులకు ప్లాస్టిక్ గ్లవ్స్ తొడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *