మేకప్ లేకుండా ఈ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..?

టెలివిజన్ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టింది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో ఈ అమ్మడు జెర్సీ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో హీరోయిన్ గా నటించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా లో మృణాల్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మేకప్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది.

సీరియల్ నటిగా పేరుతెచ్చుకున్న ఈ భామ తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో సీతగా తిష్టవేసి కూర్చోంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు వరుస ఆఫర్స్ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం మృణాల్.. నాని సరసన హాయ్ నాన్న చిత్రంలో నటిస్తోంది. ఇంకోపక్క విజయ్ దేవరకొండ సరసన VD13 లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.ఇక తాజాగా మృణాల్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఎల్లో కలర్ డ్రెస్ లో మృణాల్ కనిపించింది. షూటింగ్ అయిపోయాక.. మేకప్ తీసి ఇంటికి బయల్దేరుతున్నట్లుగా కనిపిస్తుంది. మేకప్ లేకపోవడంతో మృణాల్ న్యాచురల్ లుక్ తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమెను చూసిన అభిమానులు మృణాల్.. నువ్వేనా అంటూ షాక్ అవుతున్నారు. ఛామన ఛాయ రంగులో మృణాల్ కనిపించింది. మేకప్ లేకుండా సీతను గుర్తుపట్టడం కష్టమే.. సుమీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *