తమన్నా బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రస్తుతం ఆమె నటించిన భోళాశంకర్, జైలర్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజైన జైలర్ సాంగ్ కావాలయ్యా అంటూ అభిమానలను ఓ రేంజ్‌లో ఊపేస్తోంది ముద్దుగుమ్మ. అయితే తాజాగా కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది తమన్నా. ఈ విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు. బౌన్సర్లు ఉన్నా అభిమానుల తాకిడి ఎక్కువైంది.
ఇంతలోనే ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. బౌన్సర్లు ఉండగానే.. వారందరినీ దాటుకుంటూ వచ్చి ఒక అభిమాని తమన్నా చేయిని పట్టుకున్నాడు. దీంతో తమన్నా, బౌన్సర్లతో పాటు అక్కడున్నవారు షాక్ కు గురయ్యారు. బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే తన మంచి మనసును చాటుకుంది తమన్నా. అభిమాని ఉత్సాహాన్ని అర్థం చేసుకున్న మిల్కీ బ్యూటీ బౌన్సర్లకు నచ్చజెప్పింది. సదరు అభిమానిని ఏమీ చేయవద్దని సూచించింది.
అంతేకాదు.. ఆ అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత సరదాగా సెల్ఫీలు కూడా దిగింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గట్టిగా కేకలు వేస్తూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమన్నా మంచి మనసును పొగుడతూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Bouncers try to stop fan from getting near #Tamannaah but she says #Kaavaalaa and gracefully poses for a selfie sending the fan to cloud nine #KaavaalaaStorms100MViews Get ready to witness @tamannaahspeaks magic on big screens #JailerFromAugust10th 😍😍pic.twitter.com/cnt4N9ZFsh
— moviememesmedia (@moviememesmedi1) August 6, 2023