స్టార్ హీరో వద్ద 25 కోట్ల అప్పు చేసిన సమంత, అసలు విషయమేంటంటే..?

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ వార్తల్లో నిలుస్తోంది. సమంత ప్రస్తుతం మయోసైటిస్‌కు చికిత్స పొందుతోంది. అనారోగ్యంతో ఉన్నా.. కొన్ని సినిమాల్లో నటించింది. అయితే మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత దాని నుండి కొంచెం రిలీఫ్ దొరకగానే తాను కమిట్ అయిన సినిమాల షాట్ పూర్తి చేసుకుంది.

మళ్ళీ ఆ జబ్బు తిరగబెట్టడం తో దాన్ని పూర్తిగా తగ్గించుకునే పనిలో పడింది దీంతో సినిమాలకు మరోసారి దూరమైనా సమంత ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఆమె ట్రీట్మెంట్ కు దాదాపు 25 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ అమౌంట్ మొత్తం టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో గా అప్పుగా తీసుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా వీటిపై సమంత మాట్లాడుతూ “మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లా !? ఇది తప్పు.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.

ఈ చికిత్స కు అయ్యే ఖర్చు నా సంపాదనలో కొంచం మాత్రమే అవుతుంది. ఆ ఖర్చు నేను భరించగలను. నా కెరీర్ లో సంపాదించుకుంది మొత్తం దీని కోసమే ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. మయోసైటిస్ అనేది ఓ సమస్య మాత్రమే. వేలాది మంది ప్రజలు కూడా దీంతో బాధ పడుతున్నారు. ఇలాంటి విషయాలపై చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యత గా ఉండాలి ” అంటూ తెలిపింది సమంత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *