స్టేజ్ పై చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ధనరాజ్, దేనికో తెలుసా..?

మొదట జబర్ధస్త్ లో టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ‘ధనాధన్ ధనరాజ్’ పేరుతో టీమ్ లీడర్ గా ఎదిగిన ధన్‌రాజ్ తనదైన కామెడీ పంచులు.. హ్యూమర్ తో నవ్వులు పూయించేవాడు. జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతూనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు ధన్ రాజ్. అయితే బుల్లితెరపై నటిస్తూనే వెండితెరపై తన సత్తా చాటాడు. ఒకటీ రెండు చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరి మనసు గెలిచాడు. బిగ్ బాస్ హౌజ్ లో 41 రోజుల పాటు కొనసాగి పదో స్థానంలో నిలిచాడు. జబర్ధస్త్ కామెడీ షోకి గుడ్ బై చెప్పి ఓ ప్రముఖ ఛానెల్లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నవ్వులు పూయించాడు. ప్రస్తుతం వెండితెరపై బిజీగా ఉంటున్న ధన్ రాజ్ ఆ మద్య ఓ తమిళ సినిమాలో కూడా నటించి తన మార్క్ లో చూపించి ఆకట్టుకున్నాడు. ఆ షోలో ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్ లో చాలా మంది సీనియర్ బుల్లితెర నటులు తన ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ధన్ రాజ్ మాట్లాడుతూ చాలా ఎమోషన్ కి గురై కన్నీరు పెట్టుకోవడం అందరినీ కన్నీరు పెట్టించింది. ధన్‌రాజ్ మాట్లాడుతూ.. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు.. చిన్న వయసులో నాన్న ఆలనా.. పాలన నాకు తెలియదు. నాన్న ఇలా ఉంటాడేమో అని ఊహించుకునేవాన్ని. నాకు రక్త సంబంధం అనేదే లేదు.. నాకు ఏదైనా రక్త సంబంధం ఉంటే.. నా పిల్లలతోనే మొదలైందంటూ ధన్ రాజ్ తన కుటుంబ సభ్యులను చూపించాడు… తన పెద్ద కొడుకు కూడా తండ్రిని చూసి ఎమోషనల్ అయ్యారు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *