సినీతారలు..అవకాశాలు ఉన్నప్పుడే, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. కానీ ఒకప్పటి హీరో, ఇప్పటి విలన్ అరవింద్ స్వామి మాత్రం స్టార్‌గా వెలుగొందుతున్న రోజుల్లో అర్ధాంతరంగా సినిమాల నుంచి తప్పుకున్నాడు. రోజా, బాంబే సినిమాలతో ప్రేక్షకుల మనసులో తనదైన స్థానం సంపాదించుకున్న ఇతడు బాలీవుడ్‌లోనూ లక్ పరీక్షించుకోవాలనుకున్నాడు. అయితే అప్పట్లో అమ్మాయిలా కల రాకుమారుడిగా అరవింద్ స్వామి బాగా పాపులర్ అయ్యారు. వరుసగా మంచి మంచి సినిమాలు తీశారు.
కానీ 2000 సంవత్సరంలో సడెన్ గా సినిమాల నుండి దూరం అయ్యారు. అప్పట్నుంచి తన బిజినెస్ పైనే దృష్టి పెట్టారు. అదే సమయంలో ఆయనకు జరిగిన రోడ్ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. అరవింద్ స్వామి సినిమాల నుంచి తప్పుకున్నాక బిజినెస్ పైనే పూర్తిగా దృష్టి సారించారు. తన తండ్రికి చెన్నైలో ఓ ప్రముఖ కంటి ఆసుపత్రి ఉంది. దాంతో పాటలు కొన్ని చిన్న చిన్న బిజినెస్ లు ఉన్నాయి చెన్నైలో.
వాటిని చూసుకుంటూనే ‘ట్యాలెంట్ మ్యాక్సిమస్’ అనే ఓ సంస్థని స్థాపించి ఆ సంస్థని ఓ రేంజ్ లో డెవలప్ చేశారు అరవింద్ స్వామి. ఈ సంస్థ ఎవరికి, ఎక్కడ, ఎలాంటి సిబ్బంది కావాలన్నా అరేంజ్ చేస్తుంది. ఒక కన్సల్టెన్సీ సంస్థలా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఒక్కదాని విలువే దాదాపు 3300 కోట్లు. ఇవి కాకుండా చెన్నైలో ఉన్న హాస్పిటల్, తండ్రి, తనవి వ్యాపారాలతో కలిసి అరవిందస్వామికి దాదాపు 4000 కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నట్టు సమాచారం. దీంతో అరవింద్ స్వామికి ఈ రేంజ్ లో ఆస్తి ఉందా, ఇంత పెద్ద వ్యాపారవేత్త అని ఆశ్చర్యపోతున్నారు అంతా.