ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి హిట్స్ తో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. బిగినింగ్ లో సంచలనాలు చేసిన తరుణ్ కెరీర్ మెల్లగా డల్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఫేడ్ అవుట్ హీరో. సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. అయితే తాజాగా తరుణ్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ నిజం లేదని స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిజంగా నాకు పెళ్లి ఫిక్స్ అయితే నేనే స్వయంగా ఆ శుభవార్తను అందరితో పంచుకుంటా.
సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా నా పెళ్లి వార్త చెబుతా. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అస్సలు అర్ధం కావడం లేదు’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్ స్వయంగా పెళ్లి వార్తలపై స్పందించడంతో నెట్టింట వచ్చే పుకార్లకు చెక్ పడింది. తరుణ్ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి, నటి రోజా రమణి మాట్లాడారు. త్వరలోనే తన కొడుక్కి పెళ్లి చేస్తానని, అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పారు. దీంతో నెటిజన్లు పలు పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. చివరకు మెగా ఫ్యామిలీ అల్లుడు అని ఫిక్స్ అయ్యారు.
ఈ వార్తలు తరుణ్ వద్దకు చేరడంతో.. స్వయంగా స్పందించి వదంతులకు పులిస్టాప్ పెట్టారు. ‘మనసు మమత’తో తరుణ్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాల నటుడిగా పలు చిత్రాలలో నటించారు. 2000లో విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస ప్రేమ కథల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2018లో విడుదలైన ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాలో తరుణ్ చివరగా నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్.. బిజినెస్‌లో బిజీగా ఉన్నారు.