వైష్ణవి బేబీ సినిమా బెడ్ రూమ్ సీన్స్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.

కథలో సత్తా ఉంటే స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ తో అవకాశం లేదని నిరూపించిన సినిమా బేబీ. కంటెంట్ బాగుంటే దాని ప్రచార బాధ్యతలు కూడా ప్రేక్షకులే తీసుకుంటారు అని చెప్పడానికి బేబీ ఒక ఉదాహరణ. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమా ఈ రేంజ్ కు చేరుకుంది. అయితే బేబీ చిత్రంలోని రొమాంటిక్ సీన్స్, బోల్డ్ సన్నివేశాల్లో చేయడానికి కారణాలు చెబుతూ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది వైష్ణవి చైతన్య. తన రోల్, ఆ పాత్రకి సంబంధించిన బెడ్ రూమ్ సీన్స్ గురించి డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పినప్పుడు భయపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది.

ఈ సీన్ ను సెట్లో ఎలా చేయాలి? చేశాక ఇది బయటికి ఎలా వెళుతుంది? ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంటుందనే విషయాల్లో చాలా టెన్షన్ పడ్డానని వైష్ణవి చైతన్య చెప్పింది. ఆ భయంతోనే ఈ సినిమా చేయనని డైరెక్టుగా చెప్పానని ఆమె తెలిపింది. అయితే డైరెక్టర్ సాయి రాజేష్.. సినిమాలో హీరోయిన్ స్వభావం, ఆమె తీసుకునే నిర్ణయాలకు గల కారణాలను వివరంగా చెప్పడంతో అప్పుడు ఆ సీన్స్ చేయడానికి తనలో ధైర్యం వచ్చిందని వైష్ణవి చెప్పింది. ఇలాంటి సీన్స్ చేయనున్నట్టు తన పేరెంట్స్ కి కూడా ముందే చెప్పి వాళ్ళు ఓకే చేశాకే రెడీ అయ్యానని ఆమె తెలిపింది.

బోల్డ్ సీన్స్ లో నటించేటప్పుడు బేబీ టీం తనను చాలా కంఫర్ట్ గా చేసుకుందని ఆమె చెప్పింది. సెట్స్ లో అసౌకర్యం లేకుండా చూసుకున్నారని.. లిప్ లాక్ సీన్, రొమాంటిక్ సీన్ లో నటించేటప్పుడు సెట్ లో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పింది. ఇక విరాజ్ అశ్విన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడని.. జస్ట్ మనం నటిస్తున్నాం అంతే అని సపోర్ట్ ఇచ్చి ధైర్యంచెప్పాడని తెలిపింది. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించగలిగా అని వైష్ణవి చైతన్య చెప్పింది. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మూవీ చూశారని, వాళ్ళు కూడా అలాగే భావించారని ఆమె తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *