ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేశామని ప్రజల మంచి కోసమే తాము కష్టపడ్డామని వైసిపి నేతలు పదేపదే చెబుతున్నారు. ప్రజలు తమను ఎందుకు ఆదరించలేదు అనేది అంతు చిక్కకుండా ఉందని ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా వైసిపి ఓటమిపై శాప్ చైర్మన్, వైసిపి యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు. అయితే బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.