‘రాజ్ లేని లైఫ్ లో నేను ఉండలేను.. ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను’ అంటూ తన అడ్వొకేట్ కు సందేశం పంపించింది. దీంతో స్పందించిన సదరు అడ్వొకేట్ వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లారు.
ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక తన సూసైడ్ నోట్ లో పలు సంచలన విషయాలను పేర్కొంది లావణ్య ‘రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను.. బతకలేను. అన్నీ కోల్పోయాను. ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను. నేను ఏంటో బాగా తెలిసిన మనుషులే నన్ను తప్పు పడుతున్నారు.
అదే సమయంలో నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. రాజ్‌తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు.’