చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి, మృతికి అసలు కారణం ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వివాహం పెద్ద దుమారమే రేపింది. దీని వెనుక రాజకీయ శక్తుల ప్రభావం ఉందని అప్పట్లో చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టాక వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

అయితే మెగాస్టార్‌ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్ అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంత కాలంగా ఆయన ఊపితిత్తుల వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఉదయం చ‌నిపోయినట్లు స‌మాచారం. శిరీష్‌ మృతి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ 2007లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ పాప ఉంది. ఆ తర్వాత శిరీష్‌ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక శిరీష్‌తో విడిపోయిన అనంతరం హీరో కల్యాణ్‌ దేవ్‌ను శ్రీజ రెండో వివాహం చేసుకుంది. ఈ జంటకు కూడా ఓ పాప ఉంది. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు కూతుళ్ల‌తో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *