తనపై కేసు పెట్టిన పుంగనూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ని చూడగానే చంద్రబాబు రియాక్షన్ చూడండి.

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యూ కట్టారు. గత ప్రభుత్వం హయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అజయ్ జైన్, శ్రీ లక్ష్మి, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణ తదితరులు..చంద్రబాబు రాగానే సచివాలయం మొదటి బ్లాక్ వద్దకు పరుగులు పెట్టారు. కానీ సీఎంను కలిసేందుకు అనుమతి దక్కలేదు.

అయితే చంద్రబాబు నాయుడు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే కీలక హామీలకు సంబంధించిన ఫైల్స్ పై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు అధికారులు తరలివస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు వస్తున్న వారిలో జగన్ మనుషులుగా ముద్రపడ్డ అధికారులు కూడా ఉన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జగన్ ముద్ర పడ్డ అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణలు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అజయ్ జైన్.. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీకి స్టేట్ మెంట్ ఇచ్చారు. పీఎస్సార్ ఆంజనేయులు చంద్రబాబు వ్యతిరేకిగా ముద్ర ఉంది. శ్రీలక్ష్మి, కేవీవీ సత్యనారాయణలకు మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరు ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ లతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *