పవన్ కళ్యాణ్ 175 సీట్లు పోటి చేసి ఉంటె.. ఏం జరిగేదో చెప్పిన KK.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని కేకే సర్వే అంచనా వేసింది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 14 సీట్లకు పరిమితం అవుతుందని కేకే సర్వే అంచనా వేసింది. అలాగే టీడీపీ పోటీచేసిన 144లో 133 సీట్లు, జనసేన 21కి 21 సీట్లు, బీజేపీ 10కి 7 సీట్లు సాధిస్తుందని కేకే సర్వే వెల్లడించింది. అయితే మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 135 స్థానాలు గెలవగా.. జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో అఖండ విజయం సాధించాయి. అటు వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

దీంతో ప్రస్తుతం ఆయన గురించే సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ‘ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు..’ అంటూ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. కొందరు వైసీపీ వస్తుందని అంచనా వేస్తుంటే.. ఇంకొందరు టీడీపీ కూటమి వస్తుందని అంచనా వేశారు. కానీ కేకే సర్వే ఒక్కడే ఏపీలో కూటమి సునామీని ఊహించారని పొగడ్తలతో ముంచెత్తారు. టీడీపీకి 144 స్థానాలలో 133 స్థానాలు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు.

అలాగే జనసేన 21 స్థానాల్లో 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. పది స్థానాలకు గానూ ఏడు స్థానాలు బీజేపీ గెలుపొందుతుందని కేకే సర్వే చెప్పింది. అటు వైసీపీ 175 స్థానాలలో కేవలం 14 సీట్లు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొన్నారు. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 135 స్థానాలు గెలవగా.. జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో అఖండ విజయం సాధించాయి. అటు వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీన్ని బట్టి.. అటు.. ఇటుగా కేకే సర్వే మొత్తానికి కచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ చెప్పి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *