పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేయడంతోపాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు సివిల్ సప్లయిస్, కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. అయితే చూశారు కదా..! పవన్ కల్యాణ్ వద్దంటున్నా సరే నారా లోకేశ్ ఎంతో గౌరవంగా ఆయన కాళ్లు మొక్కారు.
ప్రస్తుతం ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం ఉదయం ప్రధాని మోదీ, ఇతర అగ్రనేతల సమక్షంలో చంద్రబాబు నాయుడు నాల్గొవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతంరం..పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం తరువాత తన అన్న చిరంజీవి కాళ్లు మొక్కారు. నారా లోకేశ్ కూడా తన ప్రమాణస్వీకారం తరువాత ప్రధాని మోదీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు.
ఆయన వద్దని సున్నితంగా తిరస్కరించారు. అనంతరం..పవన్ కల్యాణ్ వైపు వచ్చిన లోకేశ్.. పవన్ కాళ్లకు నమస్కరించారు. దీంతో..పవన్ లోకేశ్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు. చూశారు కదా..! పవన్ కల్యాణ్ వద్దంటున్నా సరే నారా లోకేశ్ ఎంతో గౌరవంగా ఆయన కాళ్లు మొక్కారు. ప్రస్తుతం ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం ఉదయం ప్రధాని మోదీ, ఇతర అగ్రనేతల సమక్షంలో చంద్రబాబు నాయుడు నాల్గొవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.