చిరు ఎవరు తను..పవన్ కళ్యాణ్ భార్య క్రేజ్ చూసి రజిని షాక్.బాలకృష్ణ దండం పెట్టేసాడు.

మెగా ఫ్యామిలీ మొత్తం గన్నవరంలోని కేసరపల్లి వద్ద నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారాన్ని ఆద్యంతం తిలకించారు. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవర్ స్టార్ ప్రమాణస్వీకారం చేస్తుంటే ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, చిరంజీవి సతీమణి సురేఖ, నాగబాబు ఆయన సతీమణి, రామ్ చరణ్ లతో పాటు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా ఈ ప్రమాణ స్వీకార వేడుకకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన భార్య అన్నా లెజ్నేవా ముఖంలో సంతోషం తొణికిసలాడింది.

పవన్ కళ్యాణ్ కష్టం ఫలించింది అన్న ఆనందంలో ఆమె ఉబ్బి తబ్బిబ్బయింది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన అకీరా నందన్ పంచకట్టుతో అందరిని ఆకట్టుకోగా, ఆధ్య కూడా చాలా ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకొని ముద్దుగా రెడీ అయి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *