ఈ హీరోయిన్ అల్లరి నరేష్ తో కలిసి ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని హీరో నాని చేతులు మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ ఈవెంట్ లో ఒక సోషల్ మీడియా పర్సన్.. ఫరియా కాలు పై ఉన్న డిఫరెంట్ టాటూ గురించి ప్రశ్నించారు. చెట్టు ఏరుల రూపంతో ఆ టాటూ కనిపిస్తుంది. అయితే “జాతిరత్నాలు” సినిమాతో తెలుగునాట మంచి పాపులారిటీ తెచ్చుకుంది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. అయితే ఆ తర్వాత తెలుగులో చేసిన..
రావణాసుర”, “లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్” అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. తమిళంలో చేసిన “వల్లి మయిల్” సినిమా కూడా అక్కడ అనుకున్న గుర్తింపు ఇవ్వలేదు. ఇకపోతే.. బంగార్రాజు సినిమాలో కూడా “వాసివాడి తస్సాదియ్యా” పాటకు అక్కినేని హీరోలు నాగ్, నాగచైతన్యతో కలిసి సూపర్ డ్యాన్స్ మూవ్స్‌తో అదరగొట్టింది.
ఇక అందాల ప్రదర్శనకు కూడా రెడీ అని.. ఇటీవల సోషల్ మీడియా ఫోటోల ద్వారా సంకేతాలు పంపుతుంది. ఇండస్ట్రీకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పనిచేసింది ఈ అమ్మడు.