నరేష్, పవిత్రా లోకేష్ ఓ హోటల్లో ఉన్న సమయంలో రమ్య రఘుపతి తన అనుచరులతో వారిపై దాడికి యత్నించడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిపై మరొకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు. అయితే నరేష్ సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాదు వారి ముగ్గురితో విడాకులను ప్రకటించి పవిత్ర లోకేష్ తో సహజీవనం అంటూ ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదని చెప్పాలి.
ఇకపోతే తన మూడవ భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చి పవిత్ర ను పెళ్లి చేసుకుందాం అని ఆలోచిస్తున్న నరేష్ కి రమ్య రఘుపతి మాత్రం గట్టి ఝలక్ ఇచ్చిందని చెప్పాలి. అసలు అతనికి విడాకులు ఆమె ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. అసలు నరేష్ ఎందుకు ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడు అనే విషయంపై ఆయనను అడిగితే ఆయనే తనను రకరకాలుగా హింసిస్తోందని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఇదే ఉద్దేశంతో తన భార్యని టార్గెట్ చేసి మరీ మళ్లీ పెళ్లి అనే ఒక సినిమాను కూడా చేయగా అది బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
ఇకపోతే నరేష్ ఎంత మంచి నటుడు అయినా కూడా క్యారెక్టర్ పరంగా ఆయన చాలా తక్కువ స్థాయిలో ఉంటాడని అందరూ చెబుతూ ఉంటారు.మరి కొంతమంది ఏమో ఆయనకు సన్నిహితంగా ఉన్నవాళ్లు నరేష్ మంచితనం అంత త్వరగా అర్థం చేసుకోవడం కష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా హింసిస్తోంది అన్న కారణంగా ఆయన విడాకులు తీసుకోవాలనుకుంటూ ఉండడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.