హంసా నందిని తెలుగు సినీనటి, మోడల్, డ్యాన్సర్. మా స్టార్స్ పత్రికకు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011,2013లకు ప్రచారకర్తగా చేశారు. మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది.
అయితే టాలీవుడ్ లో హంసానందిని తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది. ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె యువతని బాగా అలరించింది. అయితే హంసానందిని 2021లో ఆశ్చర్యకరంగా క్యాన్సర్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుని హంసా నందిని గత ఏడాది కోలుకుంది.
అయితే క్యాన్సర్ కారణంగా గుండుతో కనిపించింది. చాలా కాలం పాటు ఆమె తన గ్లామర్ లుక్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం హంసా నందిని ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. మునుపటిలా తన జుట్టు పూర్తి స్థాయిలో వచ్చింది. దీనితో హంసానందిని తన గ్లామర్ లుక్స్ కి పదును పెడుతోంది. అంతే కాదు సినిమా అవకాశాల వేటలో పడింది.
ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం హంసా నందిని మునుపటిలా తన అందంతో సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తోంది. తాజాగా హంసా నందిని కలర్ ఫుల్ అవుట్ ఫిట్ ధరించి బ్యూటిఫుల్ గా మెరిసింది.