ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు, సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. రెండ్రోజులపాటూ ఆమెను తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన అధికారులు.. మూడో రోజు కస్టడీ ముగియడంతో.. కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. కవిత చెరగని చిరునవ్వుతో మీడియా ప్రతినిధులకు కనిపించారు. ఈ కేసులో మొదటి నుంచి కవిత పిడికిలి బిగిస్తూ పోజ్ ఇస్తున్నారు.
తద్వారా తాను వెనక్కి తగ్గేది లేదనీ, పట్టుదలతో ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇదివరకు ఇలాగే పిడికిలి బిగించారు. ఇప్పుడు కూడా అలాగే కనిపించారు. సీబీఐ కోర్టు ఆమెకు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దాంతో అధికారులు ఆమెను మళ్లీ తీహార్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది సీబీఐ కస్టడీ కాదనీ, బీజేపీ కస్టడీ అని ఆమె అన్నారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు కస్టడీని ఈనెల 23 వరకు పొగిడించింది. అయితే సీబీఐ 14 రోజుల కస్టడీ కోరగా కోర్టు మాత్రం 9 రోజులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కవితపై సీరియస్ అయ్యారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఎలా మాట్లాడతారని ఫైర్ అయ్యారు. ఇంకో సారి ఇలా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు కవిత విచారణ సందర్భంగా సీబీఐ వీడియో రికార్డు చేసింది. ఇక, లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ చేసింది. కవిత రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఈ నెల 16న జరగనుంది.