నందమూరి బాలకృష్ణ మాస్ విశ్వరూపాన్ని మరోసారి బయట పెట్టిన చిత్రం లెజెండ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలయ్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది.
ఈ చిత్రం విడుదలై గురువారం రోజుకి సరిగ్గా పదేళ్లు పూర్తవుతోంది. దీనితో లెజెండ్ 10 ఇయర్స్ సెలెబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, బోయపాటి, నిర్మాతలు, హీరోయిన్ సోనాల్ చౌహన్, ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య ప్రసంగం హైలైట్ గా నిలిచింది.
లెజెండ్ చిత్రంతో పాటు బాలయ్య రాజకీయ అంశాలని కూడా టచ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన కెరీర్ లో స్పెషల్ గా నిలిచిన చిత్రాలన్నింటిని ప్రస్తావించారు. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాలు సృష్టించిన రికార్డులని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రాలు 100 రోజులని అత్యధిక సెంటర్స్ లో పూర్తి చేసుకున్నాయని బాలయ్య అన్నారు.
రికార్డులు నాకేమీ కొత్త కాదు. చరిత్ర సృష్టించాలన్నా నేనే.. వాటిని తిరగరాయాలన్నా నేనే అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అదరగొట్టారు.