పార్వతీశం నటించిన లేటెస్ట్ చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వీ ఎస్ ముఖేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రణికాన్వికా ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. బీ2పీ స్థూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మార్కెట్ మహాలక్ష్మి ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్.
అయితే మహాలక్ష్మీ అన్న పేరు ఉన్నవారికి దాదాపు 200 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషనల్లో స్టార్ యాంకర్ చేత చెంప దెబ్బలు తిన్నాడు హీరో పార్వతీశం. బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి.. తాజాగా ఈ చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో హీరో పార్వతీశంను యాంకర్ శ్రీముఖి చెంపదెబ్బ కొట్టింది. అంతేకాదు.. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఆ వీడియోలో.. హీరో పార్వతీశం శ్రీముఖి వద్దకు వెళ్లి.. మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ అని చెప్తాడు. దీంతో శ్రీముఖి అతడి చెంపపై ఒక్కటి ఇస్తుంది. ఆ తర్వాత అతడు వెళ్లిపోతుంటే పిలిచి.. మార్కెట్ మహాలక్ష్మీ ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు అంటూ సినిమాలోని హీరోయిన్ డైలాగ్ చెబుతూ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఈనెల 29న రిలీజ్ చేయనున్నారు.
Why did Anchor #Sreemukhi slap Hero #Paravateesam? Promo out now! Don’t miss the full interview tomorrow!
— Mukesh G (@MukeshG39549544) March 21, 2024
మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు!! 🔥#MM #MarketMahalakshmi @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa #B2PStudios @vickyvenki1 pic.twitter.com/jOIp954dAo